
న్యూఢిల్లీ : ఈ ఏడాది లోక్‌సభ ఎలక్షన్స్ ఉన్నప్పటికీ ఐపీఎల్ 17వ సీజన్ ఇండియాలోనే జరుగుతుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర ఏజెన్సీలతో చర్చించి షెడ్యూల్‌ను ఖరారు చేస్తామని ప్రకటించారు. ‘ఎలక్షన్ షెడ్యూల్ గురించి వేచిచూస్తున్నాం.
ఏ రాష్ట్రంలో ఏ సమయంలో ఎలక్షన్స్ ఉంటాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని లీగ్ షెడ్యూల్‌ను ఖరారు చేయాలని అనుకుంటున్నాం. మార్చి చివరి వారంలో ఐపీఎల్ మొదలయ్యే అవకాశం ఉంది’ అని అరుణ్ పేర్కొన్నారు.