IPL Franchises: అలాంటి వారిని బ్యాన్ చేయండి.. బీసీసీఐకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు విజ్ఞప్తి

IPL Franchises: అలాంటి వారిని బ్యాన్ చేయండి.. బీసీసీఐకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు విజ్ఞప్తి

బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానుల మధ్య సమావేశానికి మరో రెండు గంటల సమయం ఉంది. ఈ సమావేశానికి ముందు ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఐపీఎల్ నుంచి తప్పుకునే ఫారెన్ ప్లేయర్ల విషయంలో 10 మంది ఫ్రాంచైజీలు అసంతృప్తిగా ఉన్నారట. రెండు నెలల పాటు సుదీర్ఘంగా జరగబోయే ఐపీఎల్ నుంచి కొంతమంది విదీశీ ఆటగాళ్లు అనవసర సాకులు చెప్పి తప్పుకుంటున్నారని.. వీరిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జట్ల ఫ్రాంచైజీలు చెప్పారట.

లీగ్ మధ్యలో తప్పుకోవడం కొంతమంది ఆటగాళ్లకు ఇష్టం లేదని..అయినా దేశం కోసం ఐపీఎల్ మధ్యలోనే వెళ్లాల్సి వస్తుందని.. ఈ సమస్యకు ఏమైనా పరిష్కారం సూచించాలని భావిస్తున్నారట. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్.. పాకిస్తాన్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు ఐపీఎల్ ప్లే ఆప్స్ జరుగుతున్న సమయంలో ఇంగ్లాండ్ వెళ్లాల్సి వచ్చింది. నిజానికి బట్లర్ ఈ విషయం పట్ల సంతోషంగా లేడు. ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ లు నిర్వహించకూడదని కోరాడు. బట్లర్ దూరమవ్వడం రాజస్థాన్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపించింది.  

జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్, వనిందు హసరంగా వంటి స్టార్ ఆటగాళ్లు వేలంలో తక్కువకు అమ్ముడవ్వడంతో ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపించలేదు. వ్యక్తిగత కారణాలు, గాయాలు వంక చెప్పి ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. దీనిపై ఫ్రాంచైజీలు సంతోషంగా లేరు. ఈ సారి ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ జరగనుంది. ముగ్గురు లేదా నలుగురు ప్లేయర్లు మాత్రమే ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవాల్సి ఉంది. మిగిలిన ప్లేయర్లలందరూ వేలంలోకి రానున్నారు.