IPL 2025: మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది.. మార్చిలోనే ఐపీఎల్ ప్రారంభం

IPL 2025: మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది.. మార్చిలోనే ఐపీఎల్ ప్రారంభం

ఐపీఎల్ ఈ సారి ముందుగానే రాబోతుంది. ప్రతిసారి ఏప్రిల్ లో ప్రారంభమయ్యే ఐపీఎల్ ఈ సారి మార్చిలోనే స్టార్ట్ కానుంది. 2025 ఐపీఎల్ సీజన్ మార్చ్ 14 నుంచి ప్రారంభం కానుంది. మే 25న జరగబోయే ఫైనల్ తో ముగుస్తుంది. దీనికి సంబంధించి ఐపీఎల్..  ఫ్రాంచైజీలకు గురువారం ఇమెయిల్‌లో ఐపీఎల్ తేదీలను పంపింది. అంతేకాదు రానున్న మూడు సీజన్ల షెడ్యూల్  తేదీలను విడుదల చేసింది.  ESPNcricinfo ఈ విషయాన్ని ప్రకటించడంతో ఈ తేదీలు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.           

2026 సీజన్ మార్చి 15 నుంచి మే 31 వరకు.. 2027 సీజన్ మార్చి 14 నుంచి మే 30 మధ్య జరుగుతుంది. దీంతో పాటు ఒక్కో సీజన్‌లో ఎన్ని మ్యాచ్ లు జరుగుతాయో మ్యాచ్‌ల జాబితాను రిలీజ్ చేసింది. 2023, 2024 సీజన్ లో 74  మ్యాచ్ లు జరిగాయి. రానున్న సీజన్ కోసం అనగా ఐపీఎల్ 2025, 2026 ఐపీఎల్ లో 84 మ్యాచ్ లు జరుగుతాయి. 2027 ఐపీఎల్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ల సంఖ్య 94 కు చేరనుంది. 

Also Read:-నాటౌట్ అయినా ఔటిచ్చారు ..

ఈ సారి ఐపీఎల్ లో మెగా ఆక్షన్ జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగబోయే మెగా వేలం కోసం ఆటగాళ్ల జాబితాను శుక్రవారం (నవంబర్ 15) ప్రకటించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 వేలం నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతుంది. ఈ జాబితా ప్రకారం 574 మంది ఆటగాళ్లు వేలానికి వెళ్లనున్నారు. భారత కాలమాన ప్రకారం  మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభమవుతాయని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్  ధృవీకరించింది.