ఐపీఎల్ 2024లో భాగంగా ఏప్రిల్ 10వ తేదీ బుధవారం రోజున రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇరు జట్ల గణాంకాలు ఒకసారి చూసినట్లు అయితే టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడగా గుజరాత్ 4 మ్యాచుల్లో గెలిచింది. రాజస్థాన్ కేవలం ఒక మ్యాచులోనే నెగ్గింది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని జట్టుగా రాజస్థాన్ నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. పాయింట్స్ టేబుల్‌లో 8 పాయింట్లతో రాజస్థాన్ టాప్‌లో ఉండగా గుజరాత్ 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. గుజరాత్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా రెండింట్లో విజయం సాధించింది. ఈ సీజన్‌లో జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ స్టేడియంలో జరిగిన మూడు మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు మూడు సందర్భాల్లోనూ 180 ప్లస్ పరుగులు చేయగలిగింది. ఈ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో ఇద్దరు బ్యాటర్లు -విరాట్ కోహ్లీ (113*), జోస్ బట్లర్ (100*) సెంచరీలు సాధించారు.
రాజస్థాన్ రాయల్స్ తరపున రియాన్ పరాగ్ నిప్పులు చెరుగుతున్నాడు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 185 పరుగులు చేసి ఫ్రాంచైజీ తరుపున అత్యధిక పరుగుల చేసిన ఆటగాడి ఉన్నాడు. ఇక బౌలింగ్‌లో, యుజ్వేంద్ర చాహల్ ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఎనిమిది వికెట్లు తీశాడు. ఇక గుజరాత్ విషయానికి వస్తే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లపై ఆ టీమ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో సుదర్శన్ 191 పరుగులు చేయగా, గిల్ 183 పరుగులు చేశాడు.
గుజరాత్ టీమ్ ( అంచనా ) : శుభమాన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, శరత్ (వికెట్ కీపర్ ), విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ
రాజస్థాన్ టీమ్ (అంచనా) : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ ( కెప్టెన్ -& వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, నాండ్రే బర్గర్