ఐపీఎల్-2024లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ హై ఓల్టేజ్ జరగనుంది. ముంబైకి ఇది నాలుగో మ్యాచ్ కాగా, బెంగళూరుకు ఆరో మ్యాచ్ కావడం విశేషం.. వాంఖడేలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచుల్లో తలపడగా ముంబై 18 మ్యాచుల్లో గెలిచింది. ఆర్సీబీ 14 మ్యాచుల్లో విజయం సాధించింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఈ రెండు టీమ్‌లు ఒక్కో మ్యాచులో మాత్రమే గెలిచాయి.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ఎనిమిదో స్థానంలో ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచిట్రాక్‌లోకి వచ్చేందుకుఇరు జట్లు చూస్తున్నాయి. కోహ్లీ మంచి ఫామ్ లో ఉండటం ఆర్సీబీకి కలిసోచ్చే ఆంశంగా చెప్పుకోవచ్చు.. - 146.29 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో కోహ్లీ 316 పరుగులు చేశాడు. ఇక ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ రెచ్చిపోయి ఆడితే ముంబై జట్టు గెలవడం పెద్ద విషయమేమీ కాదని చెప్పాలి.
ముంబై ఇండియన్స్ జట్టు(అంచనా) : ఇషాన్ కిషన్ ( వికెట్ కీపర్ ), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), టిమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు(అంచనా) : విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్ ), గ్లెన్ మాక్స్‌వెల్, సౌరవ్ చౌహాన్, కామెరాన్ గ్రీన్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్ ), రీస్ టాప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.