ఐపీఎల్ 2023లో లీగ్ దశ ముగిసింది. ప్లేఆఫ్ సమరం ప్రారంభమైంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ ఢీకొంటున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిచి జట్టు నేరుగా ఫైనల్ చేరుకోనుంది. ఓడిన జట్టు రెండో క్వాలిఫయర్తో పోటీపడనుంది. దీంతో రెండు జట్లు గెలిపే టార్గెట్గా బరిలోకి దిగాయి.
రికార్డులు...
రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డుల్లో గుజరాత్ టైటాన్స్ దే పైచేయి. ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడగా.. మూడింట్లోనూ గుజరాత్ టైటాన్స్ గెలుపొందడం విశేషం. అయితే తాజా మ్యాచ్ చెన్నై సొంతగడ్డపై జరగబోతుండటం చెన్నై సూపర్ కింగ్స్‌కి కలిసొచ్చే అంశం.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, శివమ్ దూబే, అంబటి రాయుడు, మహిష్ తీక్షణ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా,రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, రాహుల్ తేవాటియా, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ. దర్శన్ నల్ఖండే, దాసున్ శనక.