
ఫస్ట్ అండ్ ఫస్ట్ మ్యాచ్. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఓపెనింగ్ మ్యాచ్. అదికూడా డిఫెండిండ్ చాంపియన్ కోల్ కతా, కింగ్ కోహ్లీ టీమ్ బెంగళూర్ మ్యాచ్. ఇక కొన్ని గంటలే.. మ్యాచ్ చూసి ఫుల్ గా ఎంజాయ్ చెయ్యాలనుకున్న ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. శనివారం (మార్చి 22) మ్యాచ్ కు కారుమబ్బులు కమ్ముకున్నాయి. మ్యాచ్ జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో KKR-RCB మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎప్పుడెప్పుడా అని ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఈ వార్త అయితే నిజంగా బ్యాడ్ న్యూసే. శనివారం (మార్చి 22) గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీతో క్రికెట్ అభిమానులకు ట్రీట్ ఇవ్వాలనుకున్న పరిస్థితుల్లో వర్షం అడ్డంకిగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఓపెనింగ్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధం అయ్యింది. సెలబ్రిటీలు.. సింగర్స్, బీసీసీఐ పెద్దలు, వివిధ దేశాలు ఆటగాళ్లు.. ఫ్యాన్స్.. ఇలా అందరూ దాదాపు ఇప్పటికే కోల్ కతా చేరుకున్నారు.
శనివారం మ్యాచ్ కోసం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి రెండు జట్లు. కానీ 6 గంటలకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభం అవ్వడంతో ప్రాక్టీస్ కు ప్యాక్ అప్ చెప్పారు ప్లేయర్స్. స్టేడియం సిబ్బంది వెంటనే తేరుకుని పిచ్ పైన, గ్రౌండ్ లో కవర్స్ పరిచారు.
శుక్రవారం వచ్చిన వానతో కోల్ కతాలోని న్యూ ఎలిపోర్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ రెండురోజులు తీవ్రమైన గాలులు, ఉరుములు మెరుపులు, పిడుగులతో పాటు వడగళ్ల వాన పడే అవకాశం ఉందని ప్రకటించింది. దీంతో మ్యాచ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
కోల్ కతాలోని జార్ఘమ్, పుర్బా, పశ్చిమ్ మిడ్నాపూర్, బంకురా, పురూలియా, హూగ్లీ, హౌరా తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అదేవిధంగా నార్త్ సౌత్ 24 పరగణాలలో కూడా వర్షం కురవడం ఆందోళన కలిగించే అంశం.
శనివారం మ్యాచ్ సాయంత్రం 7.30 లకు ప్రారంభం కావాల్సి ఉంది. టాస్ 7 గంటలకు వేయాలి. దిశా పటానీ, శ్రేయా గోషల్, వరుణ్ ధావన్ లాంటి సెలబ్రిటీల ఈవెంట్స్ తర్వాత మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో మ్యాచ్ వాయిదా పడుతుందేమోననే ఆందోళనలో ఫ్యాన్స్ ఉన్నారు.