
ముంబై: ఐపీఎల్ టీవీ వ్యూవర్‌షిప్‌లో మరో రికార్డు నమోదైంది. గత ఎడిషన్లతో పోలిస్తే ఈసారి టీవీల్లో మ్యాచ్‌లను చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తొలి 10 మ్యాచ్‌లను రికార్డు స్థాయిలో 35 కోట్ల మంది వీక్షించారని డిస్నీ హాట్‌స్టార్ వెల్లడించింది. బార్క్ డేటా ప్రకారం మొత్తం వీక్షణ సమయం 8028 కోట్ల నిమిషాలుగా తేలింది. దీంతో గతేడాదితో పోలిస్తే ఈసారి 20 శాతం పెరిగింది. ‘ఐపీఎల్‌ను చూస్తున్న వారి సంఖ్య ప్రతి మ్యాచ్‌కూ పెరిగిపోతున్నది. 17వ సీజన్ అంచనాలను మించి సాగుతోంది. వ్యూవర్‌షిప్ ప్రకారం టోర్నీపై అభిమానం విపరీతంగా పెరిగింది. మ్యాచ్‌లను చూసే ఫ్యాన్స్‌ను కూడా రెట్టింపు చేసింది’ అని డిస్నీ హాట్‌స్టార్ స్పోర్ట్స్ హెడ్ సంజోగ్ గుప్తా పేర్కొన్నాడు.