వచ్చే ఐపీఎల్ సీజన్ (2025) కోసం రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలను 10 ఫ్రాంచైజ్‌లు గురువారం (అక్టోబర్ 31) అధికారికంగా రిలీజ్ చేశాయి. రిటెన్షన్ ప్లేయర్లు లిస్ట్‌ను అందించేందుకు ఫ్రాంచైజ్ లకు ఈ నెల 31వ తేదీ వరకు బీసీసీఐ గడువు ఇచ్చింది. గురువారంతో బీసీసీఐ విధించిన డెడ్ లైన్ ముగియనున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజ్‌లు జట్టుతో అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి అందించాయి.
ALSO READ | రిటెన్షన్‌లో సన్ రైజర్స్ ఆటగాడే తోప్.. కోహ్లీ, రోహిత్, ధోనిని మించి..
దీంతో ఏ జట్టు ఏ ఆటగాడిని రిటైన్ చేసుకుంటుంది.. ఎవరిని వదిలేస్తుందనే సస్పెన్స్‌కు ఇవాళ్టితో ఎండ్ కార్డ్ పడింది. అందరూ ఊహించినట్లుగానే టీమిండియా స్టార్ ప్లేయర్స్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌లను తమ జట్లు తిరిగి వచ్చే సీజన్ కోసం రిటైన్ చేసుకున్నాయి. వీరితో పాటుగా ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంది.. వారికి ఎంత చెల్లించిందనే పూర్తి వివరాలు కింది అందించాం.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK):
ఎంఎస్ ధోని (4 కోట్లు), రవీంద్ర జడేజా (18 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (18 కోట్లు), శివమ్ దూబే (12 కోట్లు) మతీషా పతిరానా (13 కోట్లు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB):
విరాట్ కోహ్లీ (21 కోట్లు) యశ్ దయాళ్ (5 కోట్లు), రజత్ పటీదార్ (11 కోట్లు)
గుజరాత్ టైటాన్స్:
శుభమాన్ గిల్ (16.5 కోట్లు), రషీద్ ఖాన్ (18 కోట్లు), బి సాయి సుదర్శన్ (8.5 కోట్లు), రాహుల్ తెవాటియా (నాలుగు కోట్లు), షారుక్ ఖాన్ (నాలుగు కోట్లు)
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR):
సునీల్ నరైన్ (12 కోట్లు), రింకూ సింగ్ (13 కోట్లు), హర్షిత్ రాణా (4 కోట్లు), ఆండ్రీ రస్సెల్ (12 కోట్లు), రమణదీప్ సింగ్ (4 కోట్లు), వరుణ్ చక్రవర్తి (12 కోట్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్:
హెన్రిచ్ క్లాసెన్ (INR 23 కోట్లు), పాట్ కమిన్స్ (INR 18 కోట్లు), అభిషేక్ శర్మ (INR 14 కోట్లు), ట్రావిస్ హెడ్ (INR 14 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి (INR 6 కోట్లు)
ఢిల్లీ క్యాపిటల్స్ (DC):
అక్షర్ పటేల్ (16.5 కోట్లు), కుల్దీప్ యాదవ్ (13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (10 కోట్లు), అభిషేక్ పోరెల్ (4 కోట్లు)
రాజస్థాన్ రాయల్స్ (RR):
సంజు శాంసన్ (18 కోట్లు), యశస్వి జైస్వాల్ (18 కోట్లు), రియాన్ పరాగ్ (14 కోట్లు), ధ్రువ్ జురెల్ (14 కోట్లు), షిమ్రోన్ హెట్మెయర్ (11 కోట్లు), సందీప్ శర్మ (4 కోట్లు)
లక్నో సూపర్ జెయింట్స్ (LSG):
నికోలస్ పూరన్ (INR 21 కోట్లు), మయాంక్ యాదవ్ (INR 11 కోట్లు), రవి బిష్ణోయ్ (INR 11 కోట్లు), మొహ్సిన్ ఖాన్ (INR 4 కోట్లు), ఆయుష్ బదోని (INR 4 కోట్లు)
పంజాబ్ కింగ్స్ (PBKS):
శశాంక్ సింగ్ (INR 5.5 కోట్లు), ప్రభసిమ్రాన్ సింగ్ (INR 4 కోట్లు)
ముంబై ఇండియన్స్ (MI):
జస్ప్రీత్ బుమ్రా (INR 18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (INR 16.35 కోట్లు), హార్దిక్ పాండ్యా (INR 16.35 కోట్లు), రోహిత్ శర్మ (INR 16.30 కోట్లు), తిలక్ వర్మ (INR 8 కోట్లు)