భారత క్రికెటర్, పంజాబ్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ గురుకీరత్ సింగ్ మాన్(Gurkeerat Singh Mann) శుక్రవారం అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నా నేటితో నా ప్రయాణం ముగిసింది అంటూ 33 ఏళ్ల ఈ వెటరన్ క్రికెటర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. ఈ ఐపీఎల్ స్టార్ దేశానికి ప్రాతినిథ్యం వహించాడన్న విషయం పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు.
"ఈ రోజుతో నా అద్భుతమైన క్రికెట్ ప్రయాణం ముగిసింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులు, కోచ్‌లు మరియు నా తోటి ఆటగాళ్లు అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీలో ప్రతి ఒక్కరు నా కెరీర్‌లో కీలక పాత్ర పోషించారు. అలాగే, నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)కు ప్రత్యేక ధన్యవాదాలు.." అంటూ గురుకీరత్ తన ఇన్‌స్టాలో భావోద్వేగ ప్రకటన చేశాడు.
ఆస్ట్రేలియాపై..
గురుకీరత్ మాన్ 2016 ప్రారంభంలో మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేల్లో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో పెద్దగా రాణించకపోవడంతో మళ్లీ భారత జట్టు తరపున ఆడే అవకాశం రాలేదు. ఆపై అదే ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ కోసం అతను భారత టెస్ట్ జట్టుకు ఎంపికైనప్పటికీ.. ఆడే అవకాశం రాలేదు. కెరీర్ లో కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడిన ఈ 33 ఏళ్ల ఆల్‌రౌండర్13 పరుగులు చేశాడు.
పంజాబ్ కింగ్స్
2012లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఐపీఎల్L అరంగేట్రం చేసిన గురుకీరత్ మాన్ 2017 వరకు జట్టులో కొనసాగాడు. అనంతరం 2019 నుంచి 2021 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరుపున, 2022లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడాడు.