ఐపీఎల్ సీజన్ 2024 లో అదరగొట్టిన టీమిండియా యువ క్రికెటర్లకు సెలక్టర్లు జాతీయ జట్టులో స్థానం కల్పించనున్నారు. ఏకంగా 7 గురు ఆటగాళ్లు ఈ సిరీస్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వే టూర్ కు సీనియర్లు రెస్ట్ తీసుకోవంతో యువ క్రికెటర్లకు అవకాశం లభించనుంది. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీష్ రెడ్డి, విజయ్‌కుమార్ వైషాక్, యశ్ దయాల్ ఈ లిస్ట్ లో ఉన్నారు. వీరితో పాటు వెంకటేష్ అయ్యర్ జట్టులో చేరడం దాదాపుగా ఖాయమైంది.
టీమిండియా ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ ఆడుతూ బిజీగా ఉంది. ఈ మెగా లీగ్ తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వేలో అడుగుపెట్టనుంది. ఈ టూర్ లో భాగంగా భారత్ మొత్తం 5 టీ20 మ్యాచ్ లు ఆడుతుంది. జూలై 6 నుండి 14 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. మొత్తం ఐదు టీ20లు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జూలై 6,7,10,13,14 తేదీల్లో జరుగుతాయి. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ లేదా రాహుల్ లో ఒకరు కెప్టెన్సీ చేసే అవకాశముంది.
8 ఏళ్ల తర్వాత జింబాబ్వేలో భారత్ పర్యటించడం ఇదే తొలిసారి. చివరి సారిగా 2016లో సిరీస్ ఆడగా భారత్ 2-0 తేడాతో సిరీస్ గెలిచింది. ఇప్పటివరకు మూడు సార్లు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన మన క్రికెట్ జట్టు.. రెండు సార్లు సిరీస్ గెలిచింది. 2015 లో జరిగిన సిరీస్ 1-1 తో డ్రాగా ముగిసింది. ఇక్కడ మొత్తం 7 టీ20 మ్యాచ్ లాడగా.. 5 టీ20ల్లో విజయం సాధించింది. మరో రెండు టీ20 ల్లో ఓటమి పాలైంది.
The young guns are likely to make their mark in the T20I series against Zimbabwe.#INDvZMB #IndianCricket #AbhishekSharma #RiyanParag #MayankYadav #HarshitRana #NReddy #YashDayal #VVijaykumar #Insidesport #Crickettwitter pic.twitter.com/6td9nqKjc7
— InsideSport (@InsideSportIND) June 18, 2024