
న్యూఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్17వ సీజన్ మార్చి 22 నుంచి జరిగే జరిగే అవకాశం ఉందని, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నా లీగ్ మొత్తాన్ని దేశంలోనే నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. ‘ముందుగా మొదటి 15 రోజుల షెడ్యూల్‌ను ప్రకటిస్తాం. ఎలక్షన్స్ తర్వాత మిగతా మ్యాచ్‌లు జరిగేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మార్చి 22 నుంచి లీగ్‌ను మొదలుపెట్టాలని భావిస్తున్నాం. టోర్నీ మొత్తం ఇండియాలోనే ఉంటుంది’ అని చెప్పారు.