అబుదాబీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు టి.నటరాజన్‌కు కరోనా సోకింది. దీంతో జట్టు ఆటగాళ్లతోపాటు కోచ్, ఫిజియో థెరపిస్టు తదితర సన్నిహితులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు. నటరాజన్ కు కరోనా సోకిన విషయాన్ని జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. నటరాజన్ తో సన్నిహితంగా ఉన్న మరో ఆరుగురుని వెంటనే ఐసోలేషన్‌కు పంపారు. ఐసొలేషన్ కు వెళ్లిన వారిలో విజయ్ శంకర్ (క్రికెటర్) విజయ్ కుమార్ (టీమ్ మేనేజర్) శ్యామ్ సుందర్ (ఫిజియో థెరపిస్ట్) అంజనా వన్నన్ (డాక్టర్) తుషార్ ఖేడ్కర్ ( లాజిస్టిక్ మేనేజర్) పెరియసామి గణేషన్ (నెట్ బౌలర్) ఉన్నారు.
స్టార్ బౌలర్ నటరాజన్ కు కరోనా సోకడం కలకలం రేపింది. ఇవాళ సాయంత్రం ఢిల్లీ జట్టుతో మ్యాచ్ జరగాల్సి ఉండగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో నటరాజన్ కు పాజిటివ్ గా తేలడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అయితే మ్యాచ్ యధాతథంగా జరుగుతుందని జట్టు యాజమాన్యం ప్రకటించింది.