
ఐపీఎల్ 10 జట్లు ఆడతాయని క్రికెట్ ప్రేమికులకు తెలిసిన విషయమే. వీటిలో ఒక్కో జట్టు మిగిలిన జట్టుతో ఖచ్చితంగా మ్యాచ్ ఆడబోయే సంగతి తెలిసిందే. రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్ లో జరగబోయే ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు ఉన్నాయి. ఒక జట్టు మిగిలిన 9 జట్లతో రెండు మ్యాచ్ లు ఆడితే అప్పుడు 18 మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఒక్కో మ్యాచ్ ఆడితే 9 మ్యాచ్ లు లెక్క వస్తుంది. అయితే ఈ 14 మ్యాచ్ ల లెక్క అభిమానులకు అర్ధం కావడం లేదు. ఒక్కో జట్టు 18 మ్యాచ్ లు ఆడితే షెడ్యూల్ మరింత పొడిగించాల్సి ఉంటుంది. అదే జరిగితే ఆటగాళ్లపై పని భారం ఎక్కువవుతుంది.
ఐపీఎల్ లో జట్లను తగ్గించకుండా.. మ్యాచ్ ల సంఖ్య పెరగకుండా ఐపీఎల్ నిర్వాకులు 10 జట్లను రెండు గ్రూప్ లు గా విభజించారు. వీటిలో కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పింజాబ్ కింగ్స్ ఒక గ్రూప్ లో ఉన్నాయి. మరో వైపు సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జయింట్స్, ముంబై ఇండియన్స్ ఇంకో గ్రూప్ లో ఉన్నాయి. లీగ్ దశలో తమ గ్రూప్ లోని జట్లతో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. అప్పుడు 8 మ్యాచ్ లు అవుతాయి. వేరే గ్రూప్ లో ఉన్న ఒక జట్టుతో రెండు మ్యాచ్ లు.. మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. దీంతో మొత్తం 14 మ్యాచ్ ల సంఖ్య వస్తుంది.
Also Read : టీమిండియాకు బిగ్ షాక్
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ (2025) షెడ్యూల్ ఆదివారం (ఫిబ్రవరి 16) విడుదలైంది. ఈ టోర్నీ మార్చి 22న ప్రారంభమై మే 25న ముగియనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి. ఇందులో 12 డబుల్-హెడర్ మ్యాచ్‌లు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఈడెన్‌గార్డెన్స్ వేదిక. కోల్‌కతా నైట్ రైడర్స్ సొంత మైదానం, ఐకానిక్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ టోర్నీ ప్రారంభ మ్యాచ్, ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుంది.