ఐపీఎల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్.. ఫ్యాన్స్ కి ఎస్ఆర్హెచ్ బంపరాఫర్

ఐపీఎల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్.. ఫ్యాన్స్ కి ఎస్ఆర్హెచ్ బంపరాఫర్

మార్చి 22న ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.. ఈ సీజన్ లో భాగంగా హైదరాబాద్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్ లకు గాను ఇవాళ ఉదయం ( మార్చి 7 ) 11 గంటలకు ఓపెన్ కానున్నాయి. ఈ క్రమంలో ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు టికెట్లు కొంటే ఒక జెర్సీ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది ఎస్ఆర్హెచ్. 

హైదరాబాద్ లో 23న రాజస్థాన్ తో, 27న జరిగే మ్యాచ్ లో లక్నోతో తలపడనుంది ఆరెంజ్ ఆర్మీ. ఈ మ్యాచ్ టికెట్ల కోసం గానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.

కాగా ఐపీఎల్ టోర్నీ ఈ టోర్నీ మార్చి 22న ప్రారంభమై మే 25న ముగియనుంది.  మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి. ఇందులో 12 డబుల్-హెడర్ మ్యాచ్‌లు.తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(RCB) జట్లు తలపడనున్నాయి. 

ALSO READ | సచిన్‌‌‌‌‌‌‌‌ ఫిఫ్టీ కొట్టినా..ఇండియాకు ఓటమి తప్పలేదు

ఈ మ్యాచ్‌కు ఈడెన్‌గార్డెన్స్‌ వేదిక. కోల్‌కతా నైట్ రైడర్స్ సొంత మైదానం, ఐకానిక్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ టోర్నీ ప్రారంభ మ్యాచ్, ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుంది.

గత సీజన్‌ రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మార్చి 23న తొలి పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌తో అమీ తుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరగనుంది. అదే రోజు రాత్రి మాజీ ఛాంపియన్లు చెన్నై సూపర్‌కింగ్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి