లిస్టింగ్ అదుర్స్‌‌.. ఐపీఓలో దుమ్మురేపిన మమత మెషినరీ షేర్లు

లిస్టింగ్ అదుర్స్‌‌.. ఐపీఓలో దుమ్మురేపిన మమత మెషినరీ షేర్లు

న్యూఢిల్లీ: మమత మెషినరీ, డామ్‌‌ క్యాపిటల్ అడ్వైజర్స్‌‌, కాంకర్డ్‌‌ ఎన్విరో సిస్టమ్స్ షేర్లు శుక్రవారం మార్కెట్‌‌లో బంపర్ బోణి చేశాయి. మమత మెషినరీ షేర్లు ఐపీఓ ధర రూ.243 తో పోలిస్తే 146 శాతం ఎక్కువ అంటే రూ.600 దగ్గర లిస్టింగ్ అయ్యాయి. ఇంట్రాడేలో మరింత పెరిగి రూ.630 దగ్గర అప్పర్ సర్క్యూట్ తాకాయి.

 డామ్‌‌ క్యాపిటల్ అడ్వైజర్స్ షేర్లు ఇష్యూ ధర రూ. 283 తో పోలిస్తే  39 శాతం పెరిగి రూ.393 దగ్గర లిస్టింగ్ అయ్యాయి. చివరికి 47 శాతం లాభంతో రూ.415 దగ్గర సెటిలయ్యాయి. కాంకర్డ్‌‌ ఎన్విరో సిస్టమ్స్‌‌  షేర్లు ఐపీఓ ధర రూ.701 తో పోలిస్తే 19 శాతం పెరిగి రూ.832 దగ్గర  లిస్టింగ్ అవ్వగా, ఈ లెవెల్ దగ్గరనే ముగిశాయి.