![8 ఐపీఓలు వస్తున్నాయ్.. ఆరు లిస్టింగ్స్ కూడా..](https://static.v6velugu.com/uploads/2025/02/ipo-news-primary-market-momentum-picking-up-with-8-new-issues-6-listings-scheduled-next-week_xZHOwzmigy.jpg)
న్యూఢిల్లీ: దలాల్ స్ట్రీట్ఈవారం బిజీగానే ఉండనుంది. ప్రైమరీ మార్కెట్లలో ఎనిమిది ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఆరు ఎస్ఎంఈ సెగ్మెంట్ఇష్యూలు. మెయిన్ సెగ్మెంట్లో అజాక్స్ ఇంజనీరింగ్, హెక్సావేర్ టెక్నాలజీస్ బిడ్డింగ్ కోసం వస్తాయి. వీటితో పాటు ఈ వారం ఆరు కంపెనీల లిస్టింగ్ ఉంది. వీటిలో చాముండా ఎలక్ట్రికల్ ఫిబ్రవరి 11న, కెన్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, ఆమ్విల్ హెల్త్‌కేర్ ఫిబ్రవరి 12న లిస్ట్ అవుతాయి. రెడీమిక్స్ కన్‌స్ట్రక్షన్ మెషినరీ, సోలారియం గ్రీన్ ఎనర్జీ ఫిబ్రవరి 13న లిస్ట్ అవుతాయి. ఎలెగాంజ్ ఇంటీరియర్స్ ఫిబ్రవరి 14న మార్కెట్లోకి వస్తుంది.
అజాక్స్ ఇంజనీరింగ్
కేదారా క్యాపిటల్‌కు పెట్టుబడులు ఉన్న కాంక్రీట్ పరికరాల తయారీ కంపెనీ అజాక్స్ ఇంజనీరింగ్ ఐపీఓ ఈ నెల 10-న ఓపెనై, 12 ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూతో రూ.1,269 కోట్లు సేకరించనుంది. ధరలను ఒక్కో షేరుకు రూ.599 నుంచి రూ.629 మధ్య నిర్ణయించినట్లు తెలిపింది. బెంగళూరు నుంచి పనిచేసే ఈ కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ ఫిబ్రవరి 7న ఒక రోజు పాటు ఉంటుంది. ఈ ఐపీఓలో ఫ్రెష్ ఇష్యూ ఉండదు. ఆఫర్- ఫర్- సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 2.1 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్ముతారు. ఓఎఫ్ఎస్లో భాగంగా, కేదారా క్యాపిటల్ 74.37 లక్షల షేర్లను అమ్ముతుంది. పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ అయినందున, అజాక్స్ ఇంజనీరింగ్‌కు ఈ ఐపీఓ నుంచి ఆదాయం రాదు.
హెక్సావేర్ టెక్నాలజీ
ప్రైవేట్ఈక్విటీ కంపెనీ కార్లైల్‌కు పెట్టుబడులు ఉన్న ఐటీ కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీ ఐపీఓ ఈ నెల 12–14 తేదీల మధ్య ఉంది. ఇష్యూ ద్వారా రూ.8,750 కోట్లు సేకరించనుంది. ప్రైస్ బ్యాండ్‌ను రూ.674–708 మధ్య నిర్ణయించారు. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ఈ నెల 11న ఉంటుంది. అప్పర్ ఎండ్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం కంపెనీ వాల్యుయేషన్‌ను రూ.43 వేల కోట్లుగా లెక్కించారు. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో ఉంటుంది. ఫ్రెష్ ఇష్యూ లేదు. ఓఎఫ్ఎస్ కింద ప్రమోటర్ సీఏ మాగ్నమ్ హోల్డింగ్స్ షేర్లను అమ్ముతుంది. దీనివల్ల కంపెనీకి ఎలాంటి ఆదాయమూ రాదు. మనదేశంలో ఐటీ ఐపీఓల్లో ఇదే అతిపెద్దది. టీసీఎస్ 20 ఏళ్ల కిందట రూ.4,700 కోట్లు సేకరించింది.
ఎస్ఎంఈ విభాగం
ఎస్ఎంఈ విభాగంలో, చందన్ హెల్త్‌కేర్, పీఎస్ రాజ్ స్టీల్స్, వోలర్ కార్, మాక్స్‌వోల్ట్ ఎనర్జీ, ఎల్కే మెహతా పాలిమర్స్, షణ్ముగ హాస్పిటల్ వంటి ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటాయి. వీటిలో చందన్ హెల్త్‌కేర్ అతిపెద్దది. ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ. 107 కోట్లు సేకరించాలని భావిస్తోంది. మాక్స్‌వోల్ట్ ఎనర్జీ రూ. 54 కోట్లు సేకరించాలని యోచిస్తోంది.
రూ.9,090 కోట్ల విలువైన షేర్లు అమ్మిన ఎఫ్ఐఐలు
మనదేశ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకు నికరంగా రూ.9,090 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు ఎఫ్ఐఐలులు రూ.90,993 కోట్లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు. డాలర్ బలపడటం, యూఎస్ బాండ్ యీల్డ్స్పెరగడం ఇందుకు కారణాలు.
ఇవి రెండూ ఇక నుంచి పెరిగే అవకాశాలు కనిపించనందున ఎఫ్ఐఐలు అమ్మకాలను తగ్గించే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అన్నారు. బడ్జెట్ ఆకర్షణీయంగా ఉండటం, ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించడం వల్ల ఎఫ్ఐఐల సెంటిమెంట్ బలపడే అవకాశం ఉందని ఎనలిస్టులు అంటున్నారు. అమెరికా వాణిజ్య ఘర్షణలు, ఆంక్షలు, ద్రవ్యోల్బణం వల్ల వీళ్ల చూపు ఇండియా వైపే ఉంటుందని చెబుతున్నారు.