కిందటేడాదిని మించనున్న ఐపీఓ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కిందటేడాదిని మించనున్న ఐపీఓ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:  కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐపీఓ మార్కెట్ మరింతగా దూసుకుపోతుందని సిటీ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యాంకింగ్ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్ సరాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంచనా వేశారు. రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాయని, రానున్న 12 నెలల్లో ఇవి ఓపెన్ అవుతాయన్నారు. కానీ, మార్కెట్ ప్రస్తుతం పడుతుండడంతో కొంత ఆలస్యమవ్వొచ్చని తెలిపారు. చాలా ఐపీఓలు ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్లను అమ్ముతున్నాయి. 

దీనిని బట్టి కంపెనీలకు అర్జెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఫండ్స్ అవసరం లేదని తెలుస్తోంది. దీంతో టైమింగ్ బాగున్నప్పుడు ఇన్వెస్టర్ల  ముందుకు రావడానికి కంపెనీలకు వీలుంటుంది.  కాగా,  కిందటేడాది మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిస్టింగ్ అయిన కంపెనీల్లో 70 శాతం  లిస్టింగ్ ధర కంటే తక్కువకు, 45 శాతం కంపెనీలయితే ఐపీఓ ధర కంటే తక్కువకు ట్రేడవుతున్నాయి.