న్యూఢిల్లీ: ఈ వారం ఇన్వెస్టర్ల ముందుకు ఐదు ఐపీఓలు వస్తున్నాయి. మెయిన్ బోర్డ్ ఐపీఓ డెంటా వాటర్ అండ్ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ ఈ నెల 22 న ఓపెనై 24 ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.220.5 కోట్లు సేకరించాలని కంపెనీ చూస్తోంది.
ఫేస్ వాల్యూ 10 ఉన్న ఒక్కో షేరుని రూ.279–294 రేంజ్‌లో అమ్మనున్నారు. ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో క్యాపిటల్ నెంబర్స్ ఇన్ఫోటెక్ ఐపీఓ ఈ నెల 20 న అందుబాటులోకి రానుంది. ఒక్కో షేరుని రూ.250–263 రేంజ్‌లో అమ్ముతున్నారు.
జనవరి 22 న రెక్స్‌ప్రో ఎంటర్‌ప్రైజెస్ ఐపీఓ ఓపెన్ అవుతుంది. ఒక్కో షేరుని రూ.145 దగ్గర అమ్మనున్నారు. జనవరి 24 ఈ ఐపీఓ ముగుస్తుంది. ల్యాండ్‌మార్క్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్, సీఎల్‌ఎన్ ఎనర్జీ ఐపీఓలు కూడా ఈ వారం ఓపెన్ కానున్నాయి. మొయిన్‌బోర్డ్ ఐపీఓ స్టాలిన్ ఇండియా ఫ్లోరోక్లెమికల్స్ ఐపీఓ సోమవారంతో ముగుస్తుంది.