
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి మార్కెట్ఏరియా మసీదు సమీపంలోని ఆటో డ్రైవర్ ఇప్ప ప్రభాకర్ ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. శనివారం మధ్యాహ్నం ప్రభాకర్, సరోజ దంపతులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన కొద్దిసేపటికి ఇంట్లో నుంచి మంటలు చెలరేగడంతో ఇరుగుపొరుగు వాళ్లు ఆర్పేందుకు ప్రయత్నించారు.
ఈ సంఘటనలో ఇంట్లోని టీవీ, ఎలక్ట్రానిక్వస్తువులు, కొంత బడ్డు, ఇతర సామగ్రి కాలిపోయాయి. రూ.1.50 లక్షల వరకు నష్టం జరిగిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.