అప్పటి వరకు ఐపీఎస్ అభిషేక్ మహంతి తెలంగాణలోనే

అప్పటి వరకు ఐపీఎస్ అభిషేక్ మహంతి తెలంగాణలోనే

ఐపీఎస్ అధికారి  అభిషేక్‌ మహంతికి హైకోర్టులో ఊరట లభించింది.  క్యాట్‌లో విచారణ ముగిసేంత వరకు తెలంగాణలోనే అభిషేక్‌ మహంతి విధులు నిర్వహించవచ్చని  హైకోర్టు ఆదేశించింది. 

 ఇటీవల అభిషేక్ మహంతిని ఏపీకి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది.ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన క్యాట్ ను ఆశ్రయించారు. క్యాట్ లో విచారణ తేలేంత వరకు బదిలీ చేయొద్దని హైకోర్టులో పిటిషన్ వేశారు. మార్చి 24న పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్ట్..ఆయన పిటిషన్ ను త్వరగా విచారించాలని క్యాట్ ను ఆదేశించింది.  విచారణ పూర్తయ్యే వరకు ఏపీకి పంపించొద్దని ఆదేశించింది హైకోర్ట్.

ALSO READ | హైదరాబాద్ లో ఆధార్ అప్డేట్ అంటే నరకమే.. సంవత్సరాల తరబడి తిప్పుతున్నారంటూ బాధితుల ఆవేదన

తెలంగాణలో పని చేస్తోన్న ఏపీ కేడర్ అధికారులు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‎, అభిషేక్ మహంతిని వెంటనే ఏపీకి వెళ్లేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ  (ఫిబ్రవరి 21 తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో  తక్షణమే ఏపీలో రిపోర్ట్ చేయాలని  తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 22 రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.