ఐపీఎస్ అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని రాష్ట్ర ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. ఇదే విషయాన్ని ఇవాళ హైకోర్టుకు తెలియజేసింది. రాష్ట్ర విభజన సమయంలో అభిషేక్ మొహంతిని ఏపీ కేడర్ కు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్  ను ఆశ్రయించారు అభిషేక్ మొహంతి. వెంటనే తెలంగాణకు కేటాయించాలని గతంలో క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ట్రైబ్యునల్ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు అభిషేక్ మొహంతి.

తమ ఆదేశాలను చీఫ్ సెక్రెటరీ అమలు చేయకపోవడంపై ఆగ్రహించింది. మరోవైపు క్యాట్ ఆదేశాలపై చీఫ్ సెక్రెటరీ హైకోర్టు ను ఆశ్రయించగా ఇవాళ విచారణ జరిగింది. అభిషేక్ మహంతిని తెలంగాణ కేడర్ కు తీసుకున్నట్లు హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం. నిన్న జీవో 583 జారీ చేసినట్లు హైకోర్టుకు సమర్పించారు అడ్వకేట్ జనరల్. 

 

ఇవి కూడా చదవండి

చైనాలో కరోనా ఫోర్త్ వేవ్.. లక్షణాలు ఇవే..

పెట్రో రేట్ల తగ్గింపుపై మరిన్ని చర్యలకు రెడీ

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్