పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్గా ఐపీఎస్ ఉమేశ్ చంద్ర భార్య

అమరావతి:  దివంగత ఐపీఎస్ ఆఫీసర్ ఉమేశ్ చంద్ర భార్య చదలవాడ నాగరాణికి కలెక్టర్ గా నియమితులయ్యారు. 2024, జూలై 1న పశ్చిమగోదావరి జిల్లా కొత్త కలెక్టర్ గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ గా కూడా పని చేశారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టులు, మావోయిస్టులపై దివంగత ఐపీఎస్ ఆఫీసర్ ఉమేశ్ చంద్ర ఉక్కు పాదం మోపారు. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆయనను.. 1999 సెప్టెంబరు 4న హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్(ఎస్ఆర్ నగర్) ట్రాఫిక్ కూడలి దగ్గర నలుగురు నక్సలైట్లు కాల్చి చంపారు. 

అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఉమేష్ చంద్ర సేవలకు గౌరవంగా ఆయన భార్య నాగరాణికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు.  అప్పటి నుంచి ఆమె పదోన్నతులు పొందుతూ తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.