
వివో సబ్–బ్రాండ్ఐకూ ఇండియా మార్కెట్లోకి ఐకూ 13 స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్చిప్, ట్రిపుల్కెమెరా సెటప్, 6.82-అంగుళాల స్క్రీన్, వివో ఫన్టచ్ ఓఎస్, 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 12జీబీ ర్యామ్+ 256జీబీ బేస్ మోడల్ ధర 54,999 కాగా, 16జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ. 59,999. ఇది లెజెండ్, నార్డో గ్రే రంగులలో అందుబాటులో ఉంటుంది. ఈ నెల 11 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.