
గేమర్లు, టెక్ లవర్స్ కోసం రూపొందించిన ఐకూ నియో 10ఆర్ ను మార్చి 11న విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 6,043 ఎంఎం వేపర్ కూలింగ్ ఛాంబర్, 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 6,400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 1.5కే అమోలెడ్ డిస్ ప్లే, 50 ఎంపీ సోనీ పోర్ట్రెయిట్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. రేజింగ్ బ్లూ, మూన్ నైట్ టైటానియం రంగుల్లో ఫోన్లభిస్తుందని ఐకూ తెలిపింది.