
వివో సబ్-బ్రాండ్ ఐకూ తన తాజా స్మార్ట్ఫోన్ ఐకూ జెడ్9ను ఈ నెల 12న లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ధర రూ.25 వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఇందులో 6.67 ఇంచుల స్క్రీన్, 8జీబీ ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ల ఫాస్ట్చార్జింగ్ ఉంటాయి.