U-19 cricket: ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన 14 ఏళ్ళ అమ్మాయి.. స్మృతి మంధాన రికార్డును బద్దలు

అండర్ 19 క్రికెట్ లో 14 ఏళ్ల ముంబై ఓపెనర్ ఇరా జాదవ్ వన్డేల్లో సంచలన ఇన్నింగ్స్ తో మెరిసింది. ఆదివారం( ఫిబ్రవరి 12) అండర్ 19 క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసి ఔరా అనిపించింది. 14 ఏళ్ల ముంబై ఓపెనర్ అండర్ 19 వన్డే క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి  భారత మహిళల క్రికెట్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఓవరాల్ గా 157 బంతుల్లో 346 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.  మేఘాలయతో జరిగిన మ్యాచ్ లో  ఘనత సాధించింది. 

జాదవ్ మారథాన్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 42 ఫోర్లు, 16 సిక్సర్‌లు ఉన్నాయి. ఇరా జాదవ్ విధ్వంసంతో ముంబై 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి  563 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత  మహిళా దేశీయ క్రికెట్ లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. అండర్ 19 క్రికెట్ లో ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన రికార్డును బద్దలు కొట్టింది. ఎనిమిదేళ్ల వయసులో మొదటిసారి బ్యాట్‌ పట్టిన 2025 డబ్ల్యూపీఎల్ వేలానికి తన పేరును నమోదు చేసుకున్నా అన్ సోల్డ్ గా మిగిలి పోయింది. 

ALSO READ | Team India: బీసీసీఐ రివ్యూ మీటింగ్.. రంజీ ట్రోఫీ ఆడనున్న కోహ్లీ, రోహిత్

జాదవ్ 220.38 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న మహిళల అండర్ 19 వన్ డే ట్రోఫీలో జాదవ్‌కి ఇది రెండో మ్యాచ్. అంతకుముందు మ్యాచ్‌లో ఆమె 102 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 88 పరుగులు చేసింది. ఇటీవలే ఓపెనింగ్ డోర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాదవ్ మాట్లాడుతూ జెమిమా రోడ్రిగ్స్ తన రోల్ మోడల్ అని వెల్లడించింది.