ఇజ్రాయెల్‌పై ఇరాన్, హిజ్బుల్లా సంస్థ మరో 24గంటల్లో దాడి చేసే ఛాన్స్ ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ G7 దేశాలను హెచ్చరించినట్లు Axios అనే సంస్థ నివేదించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు ఆంటోనీ బ్లింకెన్ ఆగస్టు 4న G7 దేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ Xలో తెలిపారు.
ఇజ్రాయిల్ పై జరిగే దాడులను కంట్రోల్ చేయడానికి ఇరాన్ పై ముందస్తు దాడి చేయగలదని ఇజ్రాయిల్ వార్త ఛానల్ తెలిపింది. రోజురోజుకు ఈరెండు దేశాల మధ్య దాడులు పెరిగిపోతున్నాయి. ఇరు దేశాల రక్షణ శాఖ మంత్రులు అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మొస్సాద్, షిన్ బెట్ ఆఫీసర్స్ తో ప్రధాని నెతన్యాహు సమావేశమైయ్యారు.