ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరో రెండు రోజుల్లో దాడికి దిగే అవకాశం ఉన్నట్టు యూఎస్ ఇంటెలిజన్స్ తెలిపింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఈ దాడి జరగవచ్చని అభిప్రాయపడింది. ఇజ్రయిల్ దేశంపై హమాస్ నెలల తరబడి యుద్ధం చేస్తుంది. అది కొనసాగుతుండగానే ఇరాన్‌తో శత్రుత్వం ఘర్షణకు దారి తీసింది.
సిరియాలోని డమాస్కస్‌లోని తన కాన్సులేట్‌పై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటానని ఇరాన్ చాలా రోజుల క్రితమే తెలిపింది. ఆ దాడిలో ఆరుగురు సైనిక అధికారులు మృతి చెందారని దాడికి ప్రతీకారం తీర్చుకుంటానని ఇరాన్ ఇజ్రయెల్ కు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇరాన్ మరో రెండు రోజుల్లో ఇజ్రాయెల్ పై దాడి చేయవచ్చిన యూఎస్ ఇంటెలిజన్స్ హెచ్చరించింది.
హెచ్చరికలు జారీ చేసిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ
భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్స్ ఎవరూ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చింది. 2024, ఏప్రిల్ 12వ తేదీ ఈ మేరకు భారత పౌరులకు స్పష్టం చేసింది. ప్రభుత్వం పశ్చిమ ఆసియా దేశాల్లో పరిస్థితులు బాగోలేవని.. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొందని.. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులు ఎవరూ ఆ రెండు దేశాల్లో పర్యటించటం సురక్షితం కాదని తెలిపింది.
ఆ రెండు దేశాల్లో ఉన్న భారతీయ పౌరుల రక్షణకు సంబంధించి.. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో భారతీయ ఎంబసీలతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఇరాన్ లో ఇజ్రాయోల్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, తదుపరి నోటీసు వచ్చేవరకు భారతీయులెవరూ ఇరాన్ , ఇజ్రాయెల్‌కు వెళ్లవద్దని సూచించింది.