యుద్ధం కమ్ముకొస్తుంది: ఇరాన్ చేరిన రష్యా యుద్ధ విమానాలు, ఇజ్రాయిల్ వైపు అమెరికా యుద్ధ నౌకలు

యుద్ధం కమ్ముకొస్తుంది: ఇరాన్ చేరిన రష్యా యుద్ధ విమానాలు, ఇజ్రాయిల్ వైపు అమెరికా యుద్ధ నౌకలు

పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణం కమ్ముకొస్తుంది. ఇజ్రాయిల్ పై యుద్ధం చేస్తాం అంటూ ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. అందుకు రష్యా మద్దతు తెలిపినట్లు కొన్ని అంతర్జాయ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఈ కథనాలకు కొనసాగింపుగా అన్నట్లు.. 2024, ఆగస్ట్ 6వ తేదీ రష్యా నుంచి 12 జెట్ ఫైట్ యుద్ధ విమానాలు ఇరాన్ చేరినట్లు సమాచారం. ఈ పరిణామాలతో మూడో ప్రపంచ యుద్ధం మొదలు కావటానికి అంతా సిద్ధం అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.

రష్యా నుంచి 12 యుద్ధ జెట్ విమానాలు ఇరాన్ వచ్చాయన్న వార్తల క్రమంలోనే.. లెబనాన్ దేశంలోని లెబనీస్ పట్టణాన్ని టార్గెట్ గా ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఐదుగురు లెబనాన్ పౌరులు చనిపోయారు. దీంతో ఆయా దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. 

ఈ పరిణామాలు ఇలా ఉంటే.. మరో వైపు ఇజ్రాయిల్ కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది. అమెరికాకు చెందిన యుద్ధ నౌకలను ఇజ్రాయిల్ వైపు తరలిస్తుంది. ఈ యుద్ధ నౌకలపై భారీ ఎత్తున ఫైటర్ జెట్స్ ఉండటం సంచలనంగా మారింది. పశ్చిమాసియా, యూరప్ ప్రాంతాలకు తమ యుద్ధ నౌకలను పంపిస్తున్నట్లు.. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ స్వయంగా ప్రకటించటం.. ఆ మేరకు ఆదేశాలు విడుదల చేయటం సంచలనంగా మారింది. 

ఓ వైపు ఇరాన్ వస్తున్న రష్యా యుద్ధ విమానాలు.. ఇజ్రాయిల్ వస్తున్న అమెరికా యుద్ధ నౌకలు, మరోవైపు లెబనాన్ పై వరసగా దాడులు చేస్తున్న ఇజ్రాయిల్.. లెబనాన్ చుట్టూ మోహరిస్తున్న ఇరాన్ సైన్యం.. ఇలా పశ్చిమాసియా దేశాల్లో ఏ క్షణమైన మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావొచ్చనే వార్తలు అంర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి.