హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి

ఆదివారం జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ధృవీకరించారు. ఆయన ప్రయాణిస్తున్న ఛాపర్ కూలిపోయి 20 గంటలకు పైగా అయింది. సోమవారం ఉదయం హెలికాఫ్టర్ క్రాష్ అయిన చోటుని భద్రతా సిబ్బంది గుర్తించింది. ఆ ప్రమాదంలో ఆయనతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్ధొల్లాహియాన్ కూడా మరణించారు. క్రాష్ అయిన ప్లేస్ నిటారైన లోయ ప్రాంతం కావున అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకోలేకపోతున్నారు.

2021 ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ఆయన ఇస్లామిక్ చట్టాలను అమలు చేయడంలో కఠినంగా వ్యవహరించారు. ఇరాన్ ను అణ్వస్త్ర దేశంగా మారుస్తానని పదే పదే చెప్పేవాడు. అలాగే ఆయన ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉక్కుపాదంతో అణచివేశారు. కాగా ఆయన అజర్ బైజాన్ దేశ పర్యటన ముగించుకుని ఇరాన్ తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో ఉన్న అందరూ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. దీంతో ఆ దేశ ప్రజల్లో ఒక్కసారిగా విషాద చాయలు అలుముకున్నాయి. అలాగే దేశ భద్రత చర్యలపై ఆందోళన నెలకొంది