ముగిసిన ఇరాన్ అధ్యక్షుడు రైసీ అంత్యక్రియలు..హాజరైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ భౌతిక‌కాయానికి పూర్తి అధికార లాంఛనాల‌తో గురువారం (మే23)టెహ‌రాన్ లో అత్యక్రియలు నిర్వహించారు. ఇరాన్ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ కార్యక్ర మానికి హాజరయ్యారు. భారత్ తరుపున దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ కూడా హాజరై రైసీకి నివాళులు అర్పించారు.

ఇరాన్ తాత్కాలిక అధ్య క్షడు మహ్మద్ ముఖ్‌బన్‌ని కలుసుకుని సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రైసీ అంత్యక్రియలకు హమాస్, హౌతీ, హిజ్బుల్లా మిటిటెంట్ సంస్థల లీడర్లతో పాటు తాలిబాన్ లీడర్లు హాజరయ్యారు. 

టెహ్రాన్‌లో జరిగిన ఈ అంత్యక్రియాలకు తాలిబాన్ ఉప ప్రధాని ముల్లా బరా దర్, హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియే, ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలిటెంట్ గ్రూప్ ప్రతినిధులు హాజరయ్యారు. వేలాదిగా ఇరాన్ ప్రజలు హాజరైన ప్రార్థనలకు ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నాయకత్వం వహించారు.