ఇరాన్..ఆ 17 మంది భారతీయులను విడుదల చేయాలి: జైశంకర్

బెంగళూరు: ఇరానియన్ మిలిటరీ అధీనంలో ఉన్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని విదేశాంగ మంత్రిజైశంకర్ ఇరాన్ ను కోరారు. ఇరాన్ సైన్యం స్వాధీనం చేసుకున్న పోర్చుగీసు కార్గో నౌకలో ఉన్న 17 మంది భారతీయులను నిర్బంధించవద్దని..వెంటనే వారిని విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. భారతీయుల విడుదల పై ఇరాన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. 

శనివారం (ఏప్రిల్ 13) హార్ముజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్ లింకులతో కూడిన కార్గో షిపల్ ను ఇరాన్ మిలిటరీ స్వాధీనం చేసుకుంది. ఓడలో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వెంటనే వారిని విడుదల చేయాలని ఇరాన్ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. 

బెంగళూరులో విలేకరుల సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ.. నిన్న (ఆదివారం ) ఇరాన్ కు చెందిన విదేశాంక అధికారులతో మాట్లాడాను. ఇరాన్ అదుపులో ఉన్న 17 మంది భారతీయులను వెంటనే వదిలి వేయాలని చెప్పారు. భారతీయుల విడుదల కు ఇరాన్ అధికారులు సానుకూలంగా ఉన్నట్లు విదేశాంగ మంత్రి జైశంకఱ్ చెప్పారు.