ఇరాన్ దేశ సరిహద్దుల్లో హైజాక్ అయిన నౌకలోని 17 మంది సిబ్బందిని కలవటానికి భారత అధికారులకు అనుమతి ఇచ్చింది ఇరాన్ దేశం. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రితో స్వయంగా మాట్లాడిన తర్వాత ఈ హామీ లభించింది. నౌకలోని భారతీయుల విడుదల హామీ ఇవ్వని ఇరాన్.. సిబ్బందితో సమావేశం కావటానికి.. వారితో మాట్లాడటానికి మాత్రమే అనుమతిచ్చింది.
ఇండియా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు.. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇరాన్ దేశాన్ని కోరింది ఇండియా. ఇజ్రాయెల్ దేశానికి అనుబంధంగా ఉన్న ఓ కార్గో షిఫ్ లో 17 మంది భారతీయులు పని చేస్తున్నారు. ఏప్రిల్ 13వ తేదీ ఇరాన్ దేశంలో ఈ షిఫ్ ను నిర్బంధించింది ఇరాన్. ఆ నౌకలో పని చేస్తున్న సిబ్బంది భారతీయులు కావటంతో.. ఇండియా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో నౌకలోని భారత సిబ్బందికి ఎలాంటి ప్రాణ నష్టం జరక్కుండా చూడాలని ఇరాన్ దేశాన్ని కోరింది ఇండియా. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. పరిస్థితులకు ఉద్రిక్తంగా ఉన్నాయని.. త్వరలోనే నౌకలోని భారతీయ సిబ్బందితో సమావేశానికి అనుమతిస్తామని ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అమీర్ హామీ ఇచ్చినట్లు వెల్లడించింది ఇండియా.
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలని.. పాలస్తీనా దురాక్రమణను అడ్డుకోవాలని.. ఈ అంశాలపై ఐక్యరాజ్యసమితిలో భారత్ మాట్లాడాలని ఇండియాను కోరింది ఇరాన్.