పాప్ సింగర్కు ఉరి.. దైవదూషణ నేరానికి శిక్ష వేసిన ఇరాన్

పాప్ సింగర్కు ఉరి.. దైవదూషణ నేరానికి శిక్ష వేసిన ఇరాన్

టెహ్రాన్: దైవ దూషణకు పాల్పడినందుకు పాప్ సింగర్ అమీర్ హుస్సేన్ మగ్​సౌద్లూకు ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఇరాన్​కు చెందిన అమీర్ హుస్సేన్.. పాప్​సింగర్​గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాడీ అంతటా టాటూలు వేయించుకోవడంతో టాట్​లూగా పేరుగాంచాడు. 

ఇతడిపై ఇదివరకే రకరకాల కేసులున్నాయి. వ్యభిచారాన్ని ప్రోత్సహించినందుకు గతంలో పదేండ్ల జైలు శిక్ష పడింది. రెండేండ్లపాటు జైల్లో ఉండి విడుదలయ్యాక టర్కీ వెళ్లిపోయాడు. అక్కడ ప్రదర్శనలు ఇచ్చాడు. మరోసారి ప్రాస్టిట్యూషన్​ను ప్రోత్సహించేలా కామెంట్లు చేశాడు. 

ప్రవక్త గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో అమీర్​పై ఇరాన్​లో దేశద్రోహం, దైవ దూషణకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి.