- ఇజ్రాయెల్-ఇరాన్ మద్దతు గ్రూప్‌ల మధ్య పోరు పెరిగే ప్రమాదం
యునైటెడ్ నేషన్స్: ఇజ్రాయెల్– ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా, హమాస్మధ్య పోరుతో మిడిల్ఈస్ట్లో యుద్ధ వాతావరణం నెలకొన్నది. గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ యుద్ధం రోజురోజుకూ ఉధృతమవుతూనే ఉన్నది. హమాస్ మెరుపుదాడి అనంతరం గాజాపై ప్రతీకార దాడితో మొదలైన ఇజ్రాయెల్ పోరు.. ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉన్నది. ఇదే సమయంలో లెబనాన్‌లోని హెజ్బొల్లాతోనూ యుద్ధం చేస్తున్నది.
లెబనాన్, గాజా, ఇరాన్‌పై ఎయిర్‌స్ట్రైక్స్, భూతల దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నది. ఇజ్రాయెల్‌పైనా ఇరాన్‌తోపాటు ఈ రెండు సంస్థలు ప్రతీకార దాడులు చేస్తూనే ఉన్నాయి. అయితే, ఈ యుద్ధ సంఘర్షణ రెండో ఏడాదిలోకి ప్రవేశించిందని, దశాబ్దాల్లోనే మిడిల్ ఈస్ట్‌లో ఇది ప్రమాదకర దశ అని యునైటెడ్నేషన్స్ మిడిల్ ఈస్ట్ పీస్స్పెషల్ కో ఆర్డినేటర్ వెన్నెస్‌ల్యాండ్ తెలిపారు. ఈ యుద్ధం ఇంకా విస్తృతం అయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు.