ఇరాన్ - భారతదేశం, తెలంగాణ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, పర్యాటక రంగాల్లో పరస్పరం సహకకారమే లక్ష్యంగా నగరంలో గురువారం(సెప్టెంబర్) ఇరాన్ పర్యాటక రోడ్ షో ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడిన ఆయన ఇరాన్ సాంస్కృతిక సంపద గురించి మరింత లోతుగా తెలుసుకోవటానికి, ఇరు దేశాల మధ్య పర్యాటక సంబంధాలను బలోపేతం చేయటానికి ఈ రోడ్ షో ఒక గొప్ప వేదికగా నిలిచిందని అన్నారు.
ALSO READ | ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ భేటి... అసలు విషయం ఏంటంటే..
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో సీఎం రేవంత్ కీలక విధానాలు అమలు చేస్తున్నారని మంత్రి జూపల్లి తెలిపారు. పర్యాటకులకు మెరుగైన మౌతిక సదుపాయాల కల్పన, వారసత్వ పరిరక్షణ, స్థానిక కళలు, హస్తకళలు ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. కుతుబ్ షాహీ సమాధులను పునరుద్ధరించడం తమ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ఈ రోడ్ షోతో తెలంగాణ టూరిజంను ప్రపంచానికి చూపించే అవకాశం దొరికిందని అన్నారు.