న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశ ఉనికి ప్రశ్నార్థకంగా మార్చేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే తమ న్యూక్లియర్ విధానాలు మార్చుకునేందుకు ఏమాత్రం వెనుకాడమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు కమల్ ఖరాజీ స్పష్టం చేశాడు. ఇప్పటికే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖరాజీ కామెంట్లతో టెన్షన్ మరింత పెరిగింది. ‘‘మేము న్యూక్లియర్ బాంబు తయారు చేయాలనుకోవడం లేదు.
మా దేశానికి ముప్పు ఉందంటే మాత్రం సైనిక సిద్ధాంతాలు మార్చడం తప్ప మాకు వేరే మార్గం ఉండదు. మాతో జాగ్రత్తగా ఉండండి. మా న్యూక్లియర్ ప్లాంట్లపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మేము ఎంతటికైనా తెగిస్తాం’’అని తేల్చి చెప్పారు. ఏప్రిల్‌లో సిరియా క్యాపిటల్ డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఇరాన్‌కు చెందిన హై ర్యాంక్ అధికారులు చనిపోయారు. దాడికి ఇజ్రాయెలే కారణమని ఆరోపిస్తూ.. ఇజ్రాయెల్‌పై సిరియా మిసైళ్ల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది.