కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ఆదివారం (మే 19) ప్రమాదానికి గురైంది. వాతావరణం అనుకూలించకకోవడంతో కూలిపోయనట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది. హెలికాప్టర్‌కు ఏమి జరిగింది..అందులో ఎవరు ఉన్నారు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. హెలికాప్టర్‌లో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తోపాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కూలిన హెలికాప్టర్ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నందున మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. 

మీడియా ప్రకారం..ఇరాన్‌లోని తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని జోల్ఫా సమీపంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. రైసీ పొరుగున ఉన్న అజర్‌బైజాన్‌ అధ్యక్షు డు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి డ్యామ్‌ను ప్రారంభోత్సవం పాల్గొన్నారు. రైసీ కాన్వాయ్ లో మూడు హెలికాప్టర్లు ఉన్నాయని, అందులో రెండు హెలికాప్టర్లు సురక్షితంగా తిరిగి వచ్చాయని మీడియా తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్థుల్లాహియాన్లు ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో ఉన్నట్లు తెలుస్తోంది.