లీగల్ మ్యారేజ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా.. ఆ ఏజ్‌లో పెళ్లి వద్దని ఇరాక్‌లో ఆందోళన

లీగల్ మ్యారేజ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా..  ఆ ఏజ్‌లో పెళ్లి వద్దని ఇరాక్‌లో ఆందోళన

ఇరాక్ పార్లమెంట్ చేసిన చట్టానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి మహిళా సంఘాల నాయకులు, సంఘసంస్కర్తలు, మానవ హక్కుల సంస్థలు ఆందోళనలు చేస్తున్నారు. ఇరాన్ దేశంలో మహిళల వివాహ వయస్సు 9 ఏళ్లకు తగ్గిస్తూ చట్టం చేయడానికి ప్రభుత్వం ప్రయత్రిస్తోంది. 

ప్రస్తుతం అక్కడ అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే 18 ఏళ్లు ఉండాల్సిందే.. కానీ.. దాన్ని 9ఏళ్లకు కుదించాలని, అలాగే అబ్బాయిలకు పెళ్లి వయసు 15 ఏళ్లుగా చట్టం చేయాలని ఇరాక్ గవర్నమెంట్ పార్లమెంట్ లో బిల్లు తెచ్చింది.  దానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఇప్పటికే ఆ దేశంలో 28శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఐక్య రాజ్య సమితి UNICEF తెలిపింది. చిన్న వయసులో ఆడపిల్లకు పెళ్లి చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఆ బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇరాక్ ఫెమినిస్టులు. రోడ్లపైకి వచ్చి ప్రభ్యుత్వానికి, లీగల్ మ్యారేజ్ యాక్ట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.