బాగ్దాద్: బాలికల పెండ్లి వయస్సును తొమ్మిదేండ్లకు తగ్గించాలని ఇరాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆ దేశ న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టింది. పర్సనల్ స్టేటస్ లాను సవరించేందుకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది.
ఆ దేశంలో ప్రస్తుతం బాలికల వివాహ వయస్సు 18 ఏండ్లు కాగా ఈ బిల్లు ఆమోదం పొందితే తొమ్మిదేండ్లలోపు బాలికలు, 15 ఏండ్లలోపు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తారు. దీంతో ఈ బిల్లుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మానవ హక్కులు, మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల యువతుల విద్య, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.