ఓబీసీలో ముస్లింలూ ఉన్నారు..బండి సంజయ్​కి ఇది కూడా తెలియదా?: ఈరవర్తి అనిల్

ఓబీసీలో ముస్లింలూ ఉన్నారు..బండి సంజయ్​కి ఇది కూడా తెలియదా?: ఈరవర్తి అనిల్

హైదరాబాద్, వెలుగు:  ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలూ ఉన్నారని, ఇది కూడా తెలుసుకోకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించడం కరెక్ట్ కాదని రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

ముస్లింలను బీసీలో చేర్చితే చూస్తూ ఊరుకోమని బండి సంజయ్ అనడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. బీసీలు 43 శాతం ఉండగా, ముస్లిం బీసీలు 8 శాతం ఉన్నారని మండల్ కమిషన్ సిఫారసు చేసినట్లు గుర్తుచేశారు. ప్రభుత్వం ఇచ్చే  27 శాతం విద్యా,ఉద్యోగ  రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నారని చెప్పారు. బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడారని పేర్కొన్నారు.