
సీనియర్ వర్క్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(ఐఆర్ సీఓఎన్) అప్లికేషన్లను కోరుతున్నది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేస్డ్ పై భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు మే 5వ తేదీలోగా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టు: సీనియర్ వర్క్ ఇంజినీర్ 08.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్(ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇనుస్ట్రుమెషన్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి 2025, ఏప్రిల్ 1వ తేదీ నాటికి 35 ఏండ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్: ఆఫ్లైన్ ద్వారా. జేజీఎం, హెచ్ఆర్ఎం, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సీ–4, డిస్ట్రిక్ సెంటర్, సాకెట్, న్యూఢిల్లీ.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మేనేజర్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 04.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఏదైనా యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 37 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి ఆయా వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆఫ్ లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 25.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.