New Tatkal Timings: ఏప్రిల్ 15 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్స్ కొత్త టైమింగ్స్.. తెలుసుకోండి

New Tatkal Timings: ఏప్రిల్ 15 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్స్ కొత్త టైమింగ్స్.. తెలుసుకోండి

Tatkal Train Tiket Booking: దేశంలో అనేక ప్రయాణ సౌకర్యాలు ఉన్నప్పటికీ సుదీర్ఘ దూరాలకు ప్రయాణాలు చేసేందుకు ఇప్పటికీ ప్రజలు ప్రభుత్వ రవాణా వ్యవస్థ అయిన భారతీయ రైల్వేలపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. తక్కువ ఖర్చుతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి కోసం ముందుగానే ప్రయాణానికి అనుగుణంగా చాలా మంది టికెట్స్ బుక్ చేసుకుంటుంటారు.

అయితే కొందరు మాత్రం ప్రయాణాల చివరి సమయంలో టిక్కెట్ల కోసం భారతీయ రైల్వేలు తీసుకొచ్చిన తత్కాల్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే తాజాగా వీటికి సంబంధించిన బుకింగ్ టైమింగ్స్ విషయంలో రైల్వేలు కీలక మార్పులను ప్రకటించాయి. మారిన కొత్త బుకింగ్ సమయాలు ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వస్తాయి. 

Also Read:-వరుసగా 3 రోజుల బ్యాంక్స్ క్లోజ్.. ఎందుకంటే..

ఏసీ క్లాస్ టిక్కెట్ల తత్కాల్ బుకింగ్ సమయం గతంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుండగా.. ప్రస్తుతం ఈ సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చబడింది. తత్కాల్ టిక్కెట్ కావాల్సి వారు ఒకరోజు ముందు వీటిని బుక్ చేసుకోవచ్చు. ఇదే క్రమంలో నాన్ ఏసీ స్లీపర్, 2ఎస్ టిక్కెట్ల కోసం గతంలో బుకింగ్ 11 గంటలకు తెరుచుకుంటుండగా.. ప్రస్తుతం దానిని మధ్యాహ్నం 12 గంటలకు మార్చారు. దీనిని కూడా ప్రయాణానికి ఒక్కరోజు ముందు బుక్ చేసుకోవటానికి అందుబాటులో ఉంచారు.

ఇదే క్రమంలో ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ సమయంలో గతంలో ఉన్న ఉదయం 10 గంటలను ఏప్రిల్ 15 నుంచి ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మార్చారు. ఈ కేటిగిరీ కింద టిక్కెట్లను ప్రయాణానికి ఒక్కరోజు ముందు తీసుకోవటానికి అనుమతి ఉంది. ఇదే క్రమంలో కరెంట్ రిజర్వేషన్ గతంలో ఉన్నమాదిరిగానే రైలు ప్రయాణం ప్రారంభానికి 4 గంటల మునుపే కొనసాగించాలని రైల్వేలు నిర్ణయించాయి.

అయితే పైన పేర్కొన్న వివిధ తక్కాల్ టిక్కెట్లను గతంలో ఏజెంట్ల ద్వారా కూడా బుకింగ్ చేసుకుంటానికి అనుమతించగా ప్రస్తుతం చేసిన మార్పుల కింద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో ఇకపై ఏప్రిల్ 15, 2025 నుంచి అనుమతించరని వెల్లడైంది. అలాగే ఇదే సమయంలో ప్రయాణికులకు వేగవంతంగా బుకింగ్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ వేగవంతం చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇది టిక్కెట్ బుక్కింగ్ కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించనుంది. బుకింగ్ కోసం ప్రయత్నించే ప్రయాణికులు కనీసం 10 నిమిషాల ముందు లాగిన్ కావటం ముఖ్యం.