IRCTC,IRFCలకు నవరత్న స్టేటస్..

IRCTC,IRFCలకు నవరత్న స్టేటస్..

రెండు రైల్వే ప్రభుత్వ రంగ సంస్థలను(PSU) నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలుగా అప్‌గ్రేడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) , ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) లను నవరత్న హోదా కల్పిస్తూ ఆమోదం తెలిపింది.వీటిని 25వ ,26వ నవరత్న CPSE లుగా చేసింది.  ఐఆర్ సీటీసీ, ఐఆర్ఎఫ్ సీ సిబ్బందిని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ అభినందించారు. 

IRCTC అనేది రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ పబ్లిక్  సెక్టార్ ఎంటర్ ప్రైజెస్(CPSE). దీని ఏడాది టర్నోవర్ రూ. 4,270.18 కోట్లు. పన్నుల తర్వాత లాభం (PAT )రూ. 11వందల11 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో  రూ. 3,229.97 కోట్ల నికర విలువ కలిగిన CPSE. 

IRFC  అనేది  రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన CPSE. దీని వార్షిక టర్నోవర్ రూ.26వేల644 కోట్లు.  PAT రూ. 6వేల412 కోట్లు.2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.49వేల 178 కోట్ల నికర విలువను కలిగి ఉన్న CPSE. 

IRCTC షేర్ ధర

మరోవైపు ఈ రైల్వే ప్రభుత్వ రంగ సంస్థలు సోమవారం లాభాల బాటలో సాగాయి. IRCTC షేర్లు 0.75 శాతం లాభంతో ముగిశాయి. BSEలో మునుపటి ముగింపు అయిన రూ.671.05 తో పోలిస్తే రూ.674.95 దగ్గర గ్రీన్ లో ప్రారంభమైంది. తర్వాత ఈ స్టాక్ రూ.655.70కి పడిపోయి ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.680.20ని తాకి 1.36 శాతం లాభంతో ముగిసింది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.54వేల 084గా ఉంది. 

IRFC షేర్ ధర

బిఎస్‌ఇలో గత ముగింపు రూ.112.40తో పోలిస్తే ఈ షేరు రూ.112.65 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇది రూ.115.85 గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఇది ప్రారంభ లాభాలతో జతకట్టి రూ.111.15 వద్ద ముగిసింది - గత ట్రేడింగ్ ధర నుండి 1.11 శాతం నష్టం.