మహా కుంభమేళాకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. 5 స్టార్ హోటల్ రేంజ్‎లో టెంట్ సిటీ

మహా కుంభమేళాకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. 5 స్టార్ హోటల్ రేంజ్‎లో టెంట్ సిటీ

లక్నో: ఉత్తరప్రదేశ్‎లోని ప్రయాగ్ రాజ్‎లో వచ్చే నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరగనుంది. దేశవ్యా్ప్తంగా భక్తులు హాజరుకానున్న ఈ కుంభ మేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు అన్ని పూర్తి చేసింది. ఇదిలా ఉంటే.. మహా కుంభమేళాకు వెళ్లేవారికి ఐఆర్‎సీటీసీ శుభవార్త చెప్పింది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కారాల్లో స్నానం ఆచరించడానికి వచ్చే భక్తుల కోసం ఐఆర్‏సీటీసీ ఏకంగా ఓ సిటీనే నిర్మించింది. ఇదే టెంట్ సిటీ. కుంభ మేళాకు వచ్చే భక్తుల కోసం ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్‎లో ఈ సిటీని సెటప్ చేసింది ఐఆర్‎సీటీసీ. ఈ టెంట్ సిటీలో లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేశారు. ఈ గుడారాల్లో సకల సౌకర్యాలు కల్పించినట్లు ఐఆర్‎సీటీసీ వెల్లడించింది. టెంట్ సిటీలో గుడారాలు బుక్ చేసుకునేందుకు బుకింగ్స్ ఓపెన్ చేసినట్లు తెలిపింది.  

ఏ ఏ సౌకర్యాలు ఉంటాయంటే..?

నైని జిల్లా ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 25 ఆరైల్ రోడ్‌లో ఈ టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. త్రివేణి సంగమానికి 3.5 కి.మీ దూరంలో ఏర్పాటు చేసిన ఈ టెంట్ సిటీ నుంచి పుష్కర ఘాట్లకు చేరుకోవడానికి కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఐఆర్‎సీటీసీ టెంట్ సిటీలో సూపర్ డీలక్స్ టెంట్ హౌస్‌లు, విల్లా టెంట్ హౌస్‌లు ఏర్పాటు చేశారు. ఈ టెంట్‌లలో ఉండే వారికి బాత్‌రూమ్‌లలో 24 గంటల వేడి నీటి సౌకర్యం కల్పించడంతో పాటు టెంట్లు వెచ్చగా ఉండేలా రూం బ్లోయర్స్ సెట్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ALSO READ | Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష.. ఎందుకు.. ఎక్కడ..?

టెంట్లలో బెడ్ లినెన్, టవల్స్, టాయిలెట్స్ సౌకర్యం కల్పించారు. ఈ టెంట్ సిటీలో ఫుడ్ సౌకర్యం కూడా ఉన్నట్లు తెలిపారు. టెంట్‌ సిటీలోని గుడారాల్లో టీవీ ఫెసిలిటీ  ఏర్పాటు చేసినట్లు ఐఆర్‎సీటీసీ వెల్లడించింది. సీసీటీవీ, ప్రథమ చికిత్స సౌకర్యాలు, 24 గంటల అత్యవసర సహాయం కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. టెంట్ సిటీలో మొత్తం రెండు రకాలు గుడారాలు ఉన్నాయి. 

ఒకటి సూపర్ డీలక్స్ టెంట్‌. మరొకటి స్పెషల్ విల్లా. సూపర్ డీలక్స్ టెంట్‌ రెంట్ ఒక పగలు, రాత్రికి రూ.18000. అదే స్పెషల్ విల్లాలో ఉండాలనుకుంటున్నట్లయితే ఒకరోజుకి అద్దె రూ.20000. ముందుగా బుకింగ్‌ చేసుకున్న వారికి 10 డిస్కౌంట్ లభిస్తోందని తెలిపింది ఐఆర్‎సీటీసీ. ఈ టెంట్ సిటీలో బుకింగ్ కోసం ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. IRCTC వెబ్‌సైట్ www.irctctourism.com/mahakumbhgram లో కుంభ్ గ్రామ్ టెంట్ సిటీని బుక్ చేసుకోవచ్చు. రేట్లు కాస్త ఎక్కువగా ఉన్న దానికి తగ్గ రేంజ్‎లో టెంట్ సిటీలో ఏర్పాట్లు మాత్రం ఉన్నాయి.