ఐఆర్​సీటీసీ సేవలకు అంతరాయం

ఐఆర్​సీటీసీ సేవలకు అంతరాయం

న్యూఢిల్లీ : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్​సీటీసీ) యాప్​, వెబ్​సైట్​ శనివారం కొంతసేపు పనిచేయలేదు. దీంతో వినియోగదారులు ఇబ్బందిపడ్డారు. సర్వీస్ అంతరాయాలను పర్యవేక్షించే ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ అయిన డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెటెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. టికెట్​బుక్​ అయ్యాక డబ్బు కట్టలేకపోయామని కొందరు, టికెట్లను చూడలేకపోయామని మరికొందరు తెలిపారు.

డౌన్​డిటెక్టర్​ డేటా ప్రకారం, దాదాపు 66 శాతం ఫిర్యాదులు వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించినవి కాగా, 21 శాతం యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించినవి,  13 శాతం టికెటింగ్ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా, బెంగళూరు, చెన్నై, లక్నో  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.