![గోవిందం ప్యాకేజీ.. ఐఆర్‌సీటీసీ కొత్త ప్లాన్](https://static.v6velugu.com/uploads/2023/05/tirumala-of-govindam-package_ShWzOjEN8y.jpg)
సమ్మర్ హాలిడేస్ మొదలయ్యాయి. ఇప్పటికే టూర్లకు ప్లాన్ చేశారా.. వేసవి సెలవులు ముగిసేలోగా తిరుమల టూర్ ప్లాన్ చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. గోవిందం పేరుతో రైల్ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ..
ఐఆర్‌సీటీసీ గోవిందం టూర్ ప్యాకేజీ ప్రతీ రోజూ అందుబాటులో ఉంటుంది. రెండు, మూడు రోజులు తిరుపతి టూర్ ప్లాన్ చేసుకోవాలనుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.4,000 లోపే కావడం విశేషం. ఈ ప్యాకేజీ ప్రత్యేకత ఏంటంటే ఇందులోనే తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూర్ కవర్ అవుతాయి.
Day 1: ఐఆర్‌సీటీసీ గోవిందం టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు మొదటి రోజు 12734 నెంబర్ గల రైలు ఎక్కాలి. ఈ రైలు సాయంత్రం 5.25 గంటలకు లింగంపల్లిలో, 6.10 గంటలకు సికింద్రాబాద్‌లో, రాత్రి 7.38 గంటలకు నల్గొండలో ఆగుతుంది. మొదటిరోజు రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
Day 2: రెండో రోజు తిరుపతి టూర్ ఉంటుంది. తెల్లవారుజామున 5.55 గంటలకు తిరుపతి చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత తిరుమలకు బయల్దేరాలి. ఉదయం 9 గంటలకు తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత తిరుపతికి రావాలి. హోటల్‌లో లంచ్ చేసిన తర్వాత తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. 6.25 గంటలకు 12733 నెంబర్ గల రైలు ఎక్కాలి.
Day 3: మూడో రోజు తెల్లవారుజాము 3.04 గంటలకు నల్గొండలో, 5.35 గంటలకు సికింద్రాబాద్‌లో, 6.55 గంటలకు లింగంపల్లిలో రైలు ఆగుతుంది. ఇక్కడితో టూర్ ముగుస్తుంది.
ఐఆర్‌సీటీసీ గోవిందం టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే రెండు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ షేరింగ్ ధర 3,800 రూపాయిలు.. డబుల్ షేరింగ్ ధర 3,800 రూపాయిలు.. సింగిల్ షేరింగ్ ధర 4,950 రూపాయిలుగా నిర్ణయించారు.కంఫర్ట్ ప్యాకేజీ ట్రిపుల్ షేరింగ్ ధర 5,660 రూపాయిలు డబుల్ షేరింగ్ ధర 5,660 రూపాయిలు..సింగిల్ షేరింగ్ ధర 6,790 రూపాయిలుగా ఉంది.
కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ రైలు ప్రయాణం, స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ రైలు ప్రయాణం, ఏసీ హోటల్‌లో బస, ఏసీ వాహనంలో రవాణా, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.