IRCTC : ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్ మళ్లీ డౌన్..యూజర్ల ఆగ్రహం

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్, యాప్ లో  సాంకేతిక సమస్య తలెత్తింది.  దీంతో సేవలు నిలిచిపోయాయి.  కస్టమర్స్  రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ -టికెటింగ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  

ఐఆర్ సీటీసీ యాప్‌కు సంబంధించి 36 శాతం, వెబ్‌సైట్‌కు 30 శాతం, టికెటింగ్‌కు 35 శాతం ఫిర్యాదులు వచ్చాయి.  చాలా మంది యూజర్స్   వెబ్‌సైట్ పేజీ  స్క్రీన్‌షాట్‌లను   సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ  ఫిర్యాదు చేస్తున్నారు. 

ALSO READ | గంటకు అక్షరాల వెయ్యి కార్లు: రికార్డ్ బద్దలు కొడుతున్న హైదరాబాద్, విజయవాడ హైవే

  తత్కాల్ బుక్ సమయంలో ఐఆర్సీటీసీ సైట్ పనిచేకపోవడం 2024 డిసెంబర్ మూడు సార్లు.. లేటెస్ట్ గా జనవరి 11న మరోసారి వెబ్ సైట్ సేవలు నిలిచిపోయాయి. . దీంతో ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ పనిచేయకపోవడం గత రెండు నెలల్లో ఇది నాల్గోసారి. ఐఆర్ సీటీసీ సేవలపై యూజర్స్ మండిపడుతున్నారు.