గ్రేస్ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఇన్సూరెన్స్ కవరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గ్రేస్ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఇన్సూరెన్స్ కవరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏఐ కొత్త రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పెరిగిన పాలసీ హోల్డర్ల బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెల్లించే వారికి గ్రేస్ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా  కవరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందివ్వాలని ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ (ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏఐ) ఆదేశించింది. రెన్యువల్ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోపు ప్రీమియం కట్టని వారికి 15 నుంచి 30 రోజుల వరకు గ్రేస్ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు ఇస్తున్నాయి. అంటే ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోపు ప్రీమియం కట్టేస్తే అదనపు ఛార్జీలు పడవు. ఇప్పటి వరకు  గ్రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాలసీ కవరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంపెనీలు అందివ్వడం లేదు. నెల వారీగా ప్రీమియం కట్టే వారికి 15 రోజుల గ్రేస్ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, మూడు నెలలకొకసారి, ఆరు నెలకొకసారి, ఏడాదికొకసారి  కట్టేవారికి  30 రోజుల గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏఐ ఆదేశించింది.

  గ్రేస్ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముందు నుంచే ఉన్న జబ్బులకు సంబంధించి  సమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెయిటింగ్ పీరియడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మారటోరియం పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అందుబాటులో ఉంటాయి.  ఇన్సూరెన్స్ కంపెనీలు పేషెంట్ డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  పూర్తి చేయడానికి క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్న  మూడు గంటల్లోపే ఫైనల్ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని  ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏఐ  కొత్త రూల్ తెచ్చిందని  కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లెయిమ్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మనీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డొడెజా అన్నారు. కస్టమర్ల సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరచాలని, కామన్ గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను  పరిష్కరించాలని ఆదేశించిందన్నారు. 1‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌00 శాతం క్లెయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పూర్తి చేయాలని ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏఐ కోరిందని వివరించారు. ‘కొత్త ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తీసుకురావడానికి ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏఐ సపోర్ట్ చేస్తోంది. 

వేరు వేరు ప్రాంతాలు, మెడికల్ అవసరాలకు తగ్గట్టు పాలసీలను తీసుకురావాలని కోరింది. కొత్త రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  పాలసీ హోల్డర్లకు వివిధ పాలసీలు అందుబాటులో ఉంటాయి. కస్టమర్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పారదర్శకత పెరుగుతుంది. నో క్లెయిమ్ బోనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి  పాలసీ హోల్డర్లు ప్రయోజనం పొందుతారు. ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైరి కాని ప్రీమియంలను రిఫండ్ చేసుకోవడానికి   ఎప్పుడైనా పాలసీలను క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది’ అని మనీష్ అన్నారు.  కాగా, ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏఐ తాజాగా  కొన్ని రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సవరించిన విషయం తెలిసిందే. 

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేసే క్లెయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గంటలోపే ఆమోదించాలని, హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి పేషెంట్ డిశ్చార్జ్ అవ్వడానికి మూడు గంటల్లోనే ఫైనల్ అథరైజేషన్ ఇవ్వాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. అంతేకాకుండా హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలసీల యాన్యువల్ రెన్యువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నెల గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని పేర్కొంది. ఈ గ్రేస్ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా పాలసీ హోల్డర్ల ప్రయోజనాలను కాపాడాలని తెలిపింది. అన్ని ఇండివిడ్యువల్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలసీలు రెన్యువబుల్ అని, గతంలో క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారని కొత్త క్లెయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిజెక్ట్ చేయకూడదని పేర్కొంది.